This is a poem in Telugu welcoming the new year known as Ugadi celebrated by Telugu people. This year it falls on 23rd March 2012 and called Shri Nandana year. Ugadi is celebrated with a special gravy punch mixing the six natural tastes of Nature like sweet, sour, salt etc., through tender mango, neem flower, frsh jaggery etc., with the onset of spring marked by fresh greenary and the singing of the cuckoo birds. --- S.V.Rao 

నందన ఉగాదికి కవితాంజలి:
నందనా ! నీకు వందనం !
రచన: సూరంపూడి వేంకటేశ్వర రావు.నందనా ! నీకు వందనం
చందనాదులతో స్వాగతం !
ఎన్నాళ్ళయిందో నిన్ను చూచి
ఎన్నేళ్ళయిందో నీవు వచ్చి వెళ్ళి.
క్రిందటి సారి నీవు వచ్చినపుడు చూచిన వాళ్ళు
ఎందరో షష్టి పూర్తులు చేసుకున్నారు
కొందరు పై లోకాలకు చేరుకుని మరీ చూస్తున్నారు
కొందరే వారిలో ఇట మిగిలి ఉన్నారు.
మేమెలా ఉన్నామో చెప్ప మంటావా?
మా గోడు నీ ముందు విప్ప మంటావా?
ముందటి సారి నీవు వచ్చినప్పటికీ ఇప్పటికీ
అందరిలో ఎంతో తేడా! అన్నిటిలో ఎంతో తేడా!
మాలో మా మాటల్లో
మా జీవితాలలో, మా పరిసరాలలో
మా భాష సంకీర్ణం, మా వేషం అసంపూర్ణం
మా మనసులు సంకుచితం, మమతలు సశేషం.
మాతృ భాషకన్నా పర భాషకే పెద్ద పీట
ఆంగ్లంతోనే పసివాడికి మొదటి ముద్ద.
అయినా మాండలికపు యాసలపై
రాజకీయాల కసరత్తులు ఎత్తులు.
ధనానికి ఉన్న విలువ మా జీవితాలకి లేదు
పదవికి ఉన్న ప్రాబల్యం ప్రజా ప్రయోజనాలకి లేదు.
సర్పానికి విషంలాగ పదవికి అవినీతి తోడు
అత్యాచారాలకు బలి అవుతూ అబలల గోడు.
విద్యా వైద్యం ఆహారం వ్యాపారానికి వస్తువులు
ధనం అమితంగా ఉన్నా కరువైనది మనశ్శాంతి.
పల్లెలలో పంట పొలాలని మాడ్చి అడవులనే కూల్చి కాల్చి
వాణిజ్య సంస్థలకై విలాస హర్మ్యాలు కడుతున్నాం
అభివృధ్ధికి మాత్రం అదే కొలమానం అంటున్నాం
పెంచుతున్నాం భూమి తాపం
పరిసరాలపైనే మా ప్రతాపం.
విదేశాలలొ తీరిక లేని కొలువులూ, వృధా శ్రమలూ
మాతృ దేశంలో తలిదండ్రులకి వృద్ధాశ్రమాలు
అయినా..
నందనా ! నాయనా !
నీవు వస్తున్నావంటే ఏదో తెలియని ఆనందం
అందరికీ ఏవేవో తెస్తావని ఊహల రంగుల స్వప్నం.
ప్రకృతి సైతం పులకించింది; సుగంధ పుష్పాల విరియించింది
మామిడి పిందెలతో, వేప పూతలతో, కోయిల కుహూ అని పలికింది.
అందలం ఎక్కించక పోయినా
స్యందనం సమకూర్చక పోయినా అభి
నందనలు తెలుపుతాము అభి
వందనం నీకు చేస్తాము.
ఆర్ష సాంప్రదాయం ఆధునిక విజ్నానం కలబోసి
ఆదర్శ జీవనానికి నాంది పలుకుతావని
నంద నందనుని గీత ఆచరణలో పెట్టి
నందన వనంలా మా జీవితం దిద్దుతావని
హరిదశ్వుడు ఆ సూర్యుని నీలో దర్శిస్తూ
ఉదయ స్ఫూర్తితో నూతన ఉత్సహంతో
వందనం మాత్రం సమర్పిస్తాం
నందనా! మరి మరి వందనం !!
==== సూరంపూడీ వేంకటేశ్వర రావు.
(బెంగుళూరు) ౧౮.౦౩.౨౦౧౨.
e-mail: svraosvrao@gmail.com;
mobile: 09740084561.
..
Cool :-) I think you wrote another one for Ugadi also which came on TTD, telecast on TV. :-)
ReplyDeleteYes you are right. The telecast wanted short poems not more than 10 lines.
Delete