Rao's Ragas
Tuesday, July 16, 2024
varieties of spoken Telugu
Friday, April 28, 2023
Adwaita Philosophy is the pinnacle of human intelligence and wisdom, as Sri Amarnath says. The latest scientific research is adding strength to it. Einstein’s theory of Relativity, Gravity, Cosmology, natural patterns in Fibonnaci numbers etc., show how deeply the Vedic Rishis understood about the Univere and its ways. The greatness of their understanding lies in the fact that, not only the Universe’s laws and means but also they had the experiential knowledge about thhe Maker and Sustainer of this Universee. Their kindness lies in the fact that they distributed their knowlwdge for the benefit of mankind in the form of Hymns in Upanishads. This continued upto Sri Adi Shankarachaya and his followers and spiritual Gurus.
In the light of the above, Sri Amarnath has toiled to explain the key concepts of Brahman, Prakriti and Maya. Alongwith that, he explains in simple words, what is binding the individual Self and how to overcome and become Free, i.e., attain Moksh. Within a few days of publishing this bok, it attained great accolades of scholors and Pundits of Vedanta. Some of their valuable comments are appended. My own review of the Manuscript given in Telugu some time back is also given below.
Incidentally, Sri Amarnath is a childhood friend of mine. We participated in the All India Radio’s weekly children’s programmes. We were college mates too in the Osmania University Science College – he in Geology and myself in Astronomy. Sri Amarnath worked as a Geophysicist, then as a Nuclear Physicist and much later as an Investment Banker and Insurance Advisor.
I sincerely congratulate Sri Amarnath in bringing out this beautiful and concize book ‘Pratyabhijna’. ----Surampudi Venkateswara Rao, Hyderabad, 27/04/2023.
అమర శబ్దం “ప్రత్యభిజ్న”by Amaram : (పరిచయం)
గగనమంత గహనమైన వేదాంత శాస్త్రాన్ని మనకి అందుబాటు లోనికి తేవడానికి, “ఇది ఏదో బ్రహ్మ విద్య” అని చెప్పి భయపడే వాళ్ళ భయం పోగొట్టడానికి, శ్రీ అనుమర్లపూడి అమరనాథ శర్మ గారు అందించిన ఆలంబనమే ఈ “ప్రత్యభిజ్న”. ఒకసారి చెప్పిన విషయాన్ని తిరిగి గుర్తుకు తెచ్చి చెప్పడాన్ని ప్రత్యభిజ్న అంటారు. మహర్షులు దర్శించి చెప్పిన వేద వేదాంతాలూ, ఉపనిషత్ వాక్యాలను – ముఖ్యంగా యాజ్నవల్క్య మహర్షి తెల్పిన “ఛాందోగ్యోపనిషత్” లోని వేదాంత సూత్రాలని విపులీకరిచడమే ఈ చిన్న పుస్తకం ధ్యేయం గా కనిపిస్తున్నది. ఇందులోని భాష మొదట క్లిష్టంగా అనిపించినా ఈ వేదాంత అధ్యయనంలో వాడే పారిభాషిక పదాలు క్రమంగా అలవాటు అవుతాయి పాఠకులకు. “అద్వైత సిద్ధాంతం మానవ మేధస్సు యొక్క ప్రజ్నా పాటవానికి పరాకాష్ట్ట” అన్న అమరనాధుని మాట అక్షర సత్యం. నేడు శాస్త్రీయ విజ్నానమ్ అభివృద్ధి చెంది ప్రకృతి గురించి కొత్త కొత్త అవగాహనలు వెలువడుతున్న కొద్దీ మన మహర్షులు చెప్పిన ఎన్నో విషయాలు సత్యమని ప్రపంచం గ్రహిస్తోంది. Einstein సాపేక్ష సిద్ధాంతం, గురుత్వాకర్షణ, quantum mechanics, cosmolgy, natural patterns in Fibonnaci numbers వగైరాలు అన్నిటిలోనూ మన ప్రాచీన మహర్షులు ఎంత లోతుగా ఆలోచించి ఈ విశ్వం గురించి ఆకళింపు చేసుకున్నారో అని ఆశ్చర్యం కలుగక మానదు. ఈ సృష్టి, దాని స్థితి, దాని లయం గురించి మాత్రమే కాకుండా సృష్టికర్త గురించిన అనుభవ పూర్వకమైన అవగాహనే మన మహర్షులు సాధించిన మహత్తర విజ్నానమ్. ఆ అనుభవాన్ని దాచుకొన కుండా అందరికీ పంచిపెట్టి, అర్హులైన శిష్యులకు ఆ అనుభవాన్ని పొందేలా చేయడానికి మన మహర్షులు పడిన తపన, వారి దయ అద్భుతమైనవి. బ్రహ్మము, ప్రకృతి, మాయ అనేవి అర్ధం చేసుకుంటే ఈ సృష్టి వైచిత్రి చాలామటుకు అర్ధం అవుతుందని చెప్పాలి. ఈ విషయాల గురించి తెలియ చెప్పడానికి అమరనాధ శర్మ ఎంతో తపన పడ్డట్టు కనిపిస్తున్నది. “..జీవునికి మనోమయ జగత్తు బంధానికి కారణము..” అనే అతని వాక్యం గమనార్హం. అలాగే “అవస్థా త్రయం” , “శరీర త్రయం” వీటి వివరణ రచయిత ప్రతిభని చాటుతున్నాయి. తురీయమ్, సత్, చిత్, ఆనందం వీటి వివరణ, ప్రధానంగా గ్రహించవలసినవి. మహావాక్యాలను, ఉపనిషద్ వాక్యాలను, వివరించడంతో ఈ గ్రంథం సార్డకమవుతున్నది. “ప్రత్యభిజ్న”ను తీర్చి దిద్దిన శ్రీ అమరనాధ శర్మను మనసారా అభినందిస్తున్నాను. ---- సూరంపూడి వేంకటేశ్వర రావు; రామచంద్రపురం; “భోగి” 13.01.2021.
Some comments of the Pundits are given hereunder.:
1. Sri Salaka Raghunatha Sarma garu called on receipt of copy of book. He has received sanmanam from Sri Bharati teertha swami.
2. “Sri Amaranth has very meticulously explained the various methods of self-discipline that leads to the realisation of the Ultimate Truth and how it is centered above all in theory and practice of spiritual concepts.
3. శృంగేరీ మహా స్వామి దగ్గర ఉంటున్న శ్రీ సుబ్రమణ్య శర్మ గారు పుస్తుకము చదివి ఈ క్రింది విధముగా వ్రాసారు.
"ఆర్య!
మీ మనఃపూర్వక కృషికి అభివందనాలు.నాబోటి సామాన్యునికి గూడా "ప్రత్యభిజ్న"చేసే బ్రహ్మవిద్య
పరిచయం బహుధా ప్రశంసనీయం.
నమస్సులతో
శర్మ"
4. Sri MVNP Sastry, Vijayawada
I got very good book from you by the grace of viswanatha to understand easily adwaitha, which is very toughest subject. Thank you sir.
5. శ్రీ అమర్నాథ్ గారు రచించిన "శ్రీ అద్వైత విజ్ఞాన ప్రత్యభిజ్ఞ", ప్రత్యభిజ్ఞ తత్వానికి మంచి పరిచయంగా ఉపయోగపడుతుంది. ఈ పుస్తకంలో ఉన్న ఆధ్యాత్మిక విషయాలు నా దృష్టికి అత్యంత శక్తివంతమైన, లోతైన, స్పష్టమైన, విముక్తి కలిగించే, సంప్రదాయాలు అద్భుతంగా పొందుపరిచినట్లనిపించింది. ఈ పుస్తకం అద్భుతమైనదని ఎందుకన్నానంటే ఇది కొంత అవగాహనను అందిస్తుంది. అంతిమంగా మనస్సును అధిగమించాల్సిన అవసరం గురించి అంతర్లీనంగా మేలుకొలుపుతుంది. భారతీయ సాహిత్యాన్ని విస్తృతంగా చూడడానికి ఇది మంచి అవకాశాన్ని కల్పిస్తుంది.
6. Sri Uma sahasramu is a grand sanskrit literary work combining the thought processes of Sr i Adi shankaracharya and Sri Mahakavi Kalidasa, written by none other than kavya kantha Ganapati muni. This is now translated into telugu by a great Scholar Sri Rangavajjula Muralidhara Rao garu. He adopted a different Artha Nareeswara mukha chitram, but after seeing Sri Amarnath’s book chnged to the same Title picture of “Pratyabhijna” to his own book, seeking permission of Sri Amarnath.



